ఒమిక్రాన్ ఎఫెక్ట్..11,500 విమానాల రద్దు

యూరప్, అమెరికాల్లో పంజా విసురుతున్న ఒమిక్రాన్

న్యూఢిల్లీ : కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఆందోళనకర స్థాయిలో వ్యాప్తి చెందుతోంది. ముఖ్యంగా యూరప్ దేశాలు, అమెరికా ఒమిక్రాన్ దెబ్బకు అల్లాడుతున్నాయి. దీని ప్రభావం విమానయాన రంగంపై పడింది. గత శుక్రవారం నుంచి ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 11,500 విమానాలు రద్దయ్యాయి. వేలాది విమానాలు ఆలస్యమయ్యాయి.

ఫ్లైట్ ట్రాకర్ సంస్థ ఫ్లైట్ అవేర్ వివరాల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా నిన్న దాదాపు 3 వేల విమానాలు రద్దు కాగా… ఈరోజు ఇప్పటి వరకు 1,200 విమానాలు రద్దయ్యాయి. క్రిస్మస్, న్యూఇయర్ సమయంలో విమానాలు అత్యంత రద్దీగా ఉండే తరుణంలో విమాన సర్వీసులకు ఒమిక్రాన్ రూపంలో పెద్ద విఘాతం కలిగింది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/