29 మంది ప్రయాణికులున్న రష్యా విమానం మిస్సింగ్
ల్యాండ్ అవుతుండగా గల్లంతైందన్న అధికారులు
flight
మాస్కో : రష్యాలో 28 మందితో ప్రయాణిస్తున్న ఓ విమానం అదృశ్యమైంది. రష్యాలోని మారుమూల దీవి అయిన కాంచాక్తాలో ఈ ఘటన జరిగింది. పెట్రోపావ్లోస్క్ నుంచి పాలానాకు వెళ్లిన ఏఎన్ 26 విమానం ల్యాండ్ అవుతుండగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)తో అనుసంధానం కోల్పోయిందని ఆ దేశ ఎమర్జెన్సీ శాఖ ప్రకటించింది.
విమానంలో ప్రయాణిస్తున్న 28 మందిలో ఆరుగురు సిబ్బంది, 23 మంది ప్రయాణికులున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఒకరిద్దరు చిన్నారులూ ఉన్నారని అంటున్నారు. విమానం అనుసంధానం కోల్పోయిన ప్రాంతానికి సహాయ బృందాలు హుటాహుటిన వెళ్లాయి. అప్పటికే కాంటాక్ట్ కోల్పోయిన విమానం కోసం గాలింపు ముమ్మరం చేశారు. ఘటన సమయంలో ఆకాశంలో దట్టమైన మేఘాలు అలముకున్నాయని, వాతావరణం బాగాలేదని అధికారులు చెబుతున్నారు.
తాజా వీడియో వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/videos/