జనసేన ఎమ్మెల్యె రాపాక సంచలన వ్యాఖ్యలు

Rapaka Vara Prasada Rao
Rapaka Vara Prasada Rao

గుడివాడ: జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యె రాపాక వరప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ అధిష్ఠానం తనను అడిగే పరిస్థితి, తాను చెప్పే పరిస్థితి లేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి గైర్హాజరైన ఆయన మంత్రి కొడాలి నానితో కలిసి ఎడ్ల పందాల పోటీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాపాక మీడియాతో మాట్లాడుతూ.. ఈ రాష్ట్రం మళ్లీ విడిపోకూడదన్న ఉద్దేశంతోనే మూడు రాజధానుల అంశం గురించి సిఎం జగన్ ప్రస్తావించారంటూ ప్రభుత్వ ఆలోచనకు మద్దతు తెలిపారు. రాజధాని ప్రాంత రైతులను టీడీపీ ప్రభుత్వం మోసం చేసిందని, మూడు పంటలు పండే భూములను ఇవ్వమని వారు చెబితే బలవంతంగా టీ లాక్కున్నారని ఆరోపించారు. టీడీపీ వాళ్ల మాటలు నమ్మి ధర్నాలు చేస్తున్న రైతులు సీఎం జగన్ వద్దకు వెళ్లి వారి కష్టాలు చెప్పుకుంటే పరిష్కారం లభిస్తుందని సూచించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/