మాజీ మంత్రి అయ్యన్న, ఆయన కుమారుడిపై కేసు నమోదు

పోలీసులను దుర్భాషలాడి, అవమానపరిచారని ఫిర్యాదు

అమరావతి: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, కౌన్సిలర్ అయిన ఆయన చిన్నకుమారుడు రాజేశ్‌తోపాటు మరో ఏడుగురిపై నర్సీపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. మరిడి మహాలక్ష్మి జాతర సందర్భంగా శుక్రవారం రాత్రి నర్సీపట్నం అబీద్ సెంటర్‌లోని జీసీసీ పెట్రోలు బంకు సమీపంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన వేదిక వద్ద పోలీసుల విధులకు అయ్యన్న, ఆయన కుమారుడు ఆటంకం కలిగించారని, దుర్భాషలాడడమే కాకుండా వారిని అవమానపరిచారని, పోలీసులను బెదిరించారని నాతవరం ఎస్సై డి.శంకర్ ఫిర్యాదు చేశారు. స్పందించిన పోలీసులు అయ్యన్న, ఆయన కుమారుడు రాజేశ్‌తోపాటు మరో ఏడుగురిపై శనివారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/