20న ఏపి అసెంబ్లీ ప్రత్యేక సమావేశం
రాజధానిపై కీలక నిర్ణయం వెలువడే అవకాశం

అమరావతి: ఏపి అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఈనెల 20న జరుగనుంది. జగన్ సర్కార్ మూడు రాజధానుల ప్రకటన నేపథ్యంలో అభివృద్ధి వికేంద్రీకరణపై ఏర్పాటుచేసిన జీఎన్ రావు, బీసీజీ కమిటీలు ఇచ్చిన నివేదికల్లో మూడు రాజధానుల ప్రతిపాదనలను సూత్రప్రాయంగా అంగీకారించిన విషయం తెలిసిందే. ఈ కమిటీలు సూచించిన అంశాలు, సిఫారసులపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ ఇచ్చిన నివేదికను ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారని తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలకంటే ముందే ఈ నెల 18న ఏపీ కేబినెట్ భేటీ కానుంది. మంత్రివర్గం ఈ భేటీలో రాజధానిపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశముందని సమాచారం. జీఎన్ రావు, బీసీజీ కమిటీ ఇచ్చిన నివేదికలు, హైపవర్ కమిటీ సిఫారసులు, పాలన వింకేంద్రీకరణపై మరోసారి దృష్టి సారించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశముందని తెలుస్తోంది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/