పాలకొండ జనసేన అభ్యర్థిగా నిమ్మక జయకృష్ణ

పాలకొండ నియోజకవర్గం జనసేన అభ్యర్థిగా నిమ్మక జయకృష్ణ పేరును ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఎస్టీ నియోజకవర్గమైన ఇక్కడి నుంచి టికెట్ కోసం ఆశావహులు ఎక్కువగా పోటీపడటంతో పలు దఫాలుగా జనసేన పక్షాన సర్వేలు జరిగాయి.

ఈ సర్వేలో జయకృష్ణకు అత్యధికంగా ప్రజల మద్దతు లభించడంతో పవన్ ఆయనను అభ్యర్థిగా ఖరారు చేసినట్లు జనసేన పార్టీ ప్రకటించింది. ఈ అభ్యర్థి ప్రకటన తో మొత్తం అభ్యర్థులను జనసేన ప్రకటించినట్లు అయ్యింది. ఈ ఎన్నికల్లో NDA కూటమి లో భాగంగా జనసేన మొత్తం 21 అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లైంది.