మెగాస్టార్ చిరంజీవి ని కలిసిన జేడీ లక్ష్మీ నారాయణ

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ సతీసమేతంగా మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. లక్ష్మీనారాయణ భార్య ఊర్మిళతో కలిసి వీరి కుమార్తె వివాహానికి చిరంజీవి ఇంటికి వెళ్లి.. చిరంజీవి, సురేఖ దంపతుల్ని ఆహ్వానించారు. ప్రియాంక వివాహానికి లక్ష్మీనారాయణ పలువురు ప్రముఖుల్ని కూడా ఆహ్వానించారు.

గత కొద్దీ రోజులుగా ప్రియాంక రాజకీయాల్లోకి కూడా అడుగుపెడతారని ప్రచారం జరుగుతుంది. లక్ష్మీనారాయణతో పాటూ ఆమె కూడా విశాఖ నుంచి పోటీ చేస్తారని పొలిటికల్ సర్కిల్స్‌లో టాక్ నడిచింది. లక్ష్మీనారాయణ లోక్‌సభ.. ప్రియాంకను అసెంబ్లీకి బరిలో ఉంటారని ఊహాగానాలు వినిపించాయి. కానీ ఈ వార్తలపై లక్ష్మీనారాయణ కానీ ప్రియాంక కానీ స్పందించలేదు. కానీ లక్ష్మీనారాయణ వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీ చేయడం ఖాయమని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనదే మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది.