జగ్గారెడ్డి రాజీనామా వెనక్కి..

సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గతంలో రాహుల్ గాంధీ , సోనియా గాంధీలకు తాను రాజీనామా చేస్తున్నట్లు పంపిన లేఖ ను వెనక్కు తీసుకున్నారు. గత కొద్దీ రోజులుగా టి కాంగ్రెస్ లో జగ్గారెడ్డి వ్యవహారం హాట్ హాట్ గా నడుస్తున్న సంగతి తెలిసిందే. రేవంత్ తీసుకునే నిర్ణయాలపై జగ్గారెడ్డి మొదటి నుండి వ్యతిరేకిస్తుండడం..జగ్గారెడ్డి తెరాస లో చేరుతారనే వార్తలు రావడం వంటివి హలజడి సృష్టించాయి. ఈ క్రమంలో నిన్న సోమవారం టి కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ తో భేటీ అయ్యారు.

దాదాపు మూడు గంటలపాటు సాగిన ఈ భేటీ లో అనేక విషయాల గురించి మాట్లాడాడారు. జగ్గారెడ్డి – రేవంత్ ల వ్యవహారం కూడా చర్చించారు. భేటీ అనంతరం జ‌గ్గారెడ్డి జ‌గ్గారెడ్డి త‌న రాజీనామాను వెన‌క్కి తీసుకుంటున్నాని ప్ర‌క‌టించారు. రాహుల్ గాంధీ నాయ‌క‌త్వంలో తాను ప‌ని చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. రాహుల్ గాంధీని చూసిన త‌ర్వాత గ‌తంలో తాను ఏం మాట్లాడానో మ‌ర్చి పోయాన‌ని అన్నారు. చివ‌రి వ‌ర‌కు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాన‌ని ప్ర‌క‌టించారు. ఈ ప్రకటన తో కాంగ్రెస్ కార్య కర్తలు , నేతలు హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు. ఇక ఈ సమావేశంలో రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ అంశాలు, ప్రభుత్వ విధానాలు, క్షేత్రస్థాయిలో పార్టీ స్థితిగతులు, అంతర్గత విభేదాలు, సంస్థాగత వ్యవహారాలు, పలు ఇతర అంశాలను రాహుల్‌ అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర నేతలు చెప్పిన అంశాలను విన్నారు. పార్టీలో ఏవైనా విభేదాలుంటే అంతర్గతంగా మాట్లాడుకోవాలని రాష్ట్ర నేతలకు రాహుల్‌గాంధీ స్పష్టం చేశారు. మీడియా ముందు ఎవరూ మాట్లాడొద్దని సూచించారు. ఏవైనా అభిప్రాయ భేదాలుంటే అధిష్టానానికి చెప్పుకొనేలా తాను ఏర్పాటు చేస్తానని.. పార్టీ అంతర్గత విషయాలను బయట చర్చిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించినట్లు తెలుస్తుంది.

భేటీ సందర్భంగా సునీల్‌ కనుగోలును టీపీసీసీ నేతలకు రాహుల్‌గాంధీ పరిచయం చేసి, పలు సూచనలు చేసినట్టు సమాచారం. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి గురించి సునీల్‌ తన పని తాను చేసుకుంటున్నారని, ఆయనను ఓ ఏజెన్సీగా భావించవద్దని పేర్కొన్నట్టు తెలిసింది. సునీల్‌ కాంగ్రెస్‌ పార్టీ వర్కర్‌ అని, ఆయన పూర్తిగా ఏఐసీసీ పరిధిలో పనిచేస్తారని, అవసరమైనప్పుడు రాష్ట్ర కాంగ్రెస్‌ నేతల సాయం తీసుకుంటారని వివరించినట్టు సమాచారం.