మంగళగిరి గంజి చిరంజీవికి కీలక పదవి ఇచ్చిన సీఎం జగన్

CM Jagan gave Mangalagiri Ganji Chiranjeevi a key post

మంగళగిరి టీడీపీ లో కీలక నేత అయిన గంజి చిరంజీవి..ఈ మధ్యనే వైస్సార్సీపీ లో చేరిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకున్నారు. కాగా ఇప్పుడు చిరంజీవికి కీలక పదవి అప్పగించారు జగన్ మోహన్ రెడ్డి. వైయస్ జగన్ ఆదేశాల మేరకు ఆయనను రాష్ట్ర చేనేత విభాగం అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. టీడీపీ నుంచి వైస్సార్సీపీ లో చేరిన కొద్ది రోజులకే చిరంజీవికి కీలక పదవి దక్కడం విశేషం. చిరంజీవికి కీలక పదవి దక్కడం పట్ల కార్యకర్తలు అంత కూడా అదృష్టం అంటే గంజి చిరంజీవిదే.. అలా పార్టీలో చేరాడు.. ఇలా కీలక పదవి దక్కించుకున్నాడని మాట్లాడుకుంటున్నారు.

ఇక మంగళగిరి నియోజకవర్గం పరిధిలో బీసీ సామాజిక వర్గం ఓటర్లు పెద్ద సంఖ్యలో నివసిస్తోన్నారు. వారిలో మెజారిటీలు పద్మశాలీయులే. ఇప్పుడదే సామాజిక వర్గానికి చెందిన గంజి చిరంజీవి రాకతో వైస్సార్సీపీ మరింత బలోపేతమైనట్టే. అదే సమయంలో ఆయనను పార్టీ చేనేత విభాగం అధ్యక్షుడిగా నియమించడం అదనపు బలంగా మారినట్టయింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ పోటీ చేసి, ఓడిపోయిన ఈ నియోజకవర్గంలో వైస్సార్సీపీ పట్టు మరింత పెరిగినట్టయింది.

2014 అసెంబ్లీ ఎన్నికల్లో సొంత టీడీపీ నాయకులే తనను ఓడించారని, రాజకీయంగా హత్య చేశారని గంజి చిరంజీవి ఆ మధ్య చెప్పుకొని కన్నీరు పెట్టుకున్నారు. 2019లో నారా లోకేష్ కోసం తాను టికెట్‌ను త్యాగం చేశానని, అయినప్పటికీ కనీస గౌరవం దక్కట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో తనకు ఎలాంటి చెడ్డ పేరు లేదని, వివాదారహితుడిగా ఉన్నానని వ్యాఖ్యానించారు. తనను కాదని- మంగళగిరిలో స్థానికేతరులను చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ప్రోత్సహించారని విమర్శించారు.