కారుణ్య నియామకాలకు జగన్ గ్రీన్ సిగ్నల్

కారుణ్య నియామకాలకు జగన్ గ్రీన్ సిగ్నల్

కరోనా తో మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లోని వారికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. వచ్చే నెల 30 నాటికి కారుణ్య నియామకాలు పూర్తి చేయాలని ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

వైద్య, ఆరోగ్య శాఖపై సీఎం జగన్‌ సోమవారం తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష చేపట్టారు. డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, కోవిడ్ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు హాజరయ్యారు. మెడికల్ కాలేజీల నిర్మాణం, విలేజ్ అర్బన్ హెల్త్ ఏర్పాటుపై సీఎం సమీక్షిస్తున్నారు.