తెలంగాణ గడ్డపై ఎగిరేది కాషాయ జెండాయే – ఈటెల

తెలంగాణ గడ్డపై ఎగిరేది కాషాయ జెండాయే - ఈటెల

హుజూరాబాద్‌ ఉప ఎన్నిక పోలింగ్‌ తేదీ సమయం దగ్గర పడుతుండడం తో పార్టీల నేతలు తమ నోటికి ఇంకాస్త పనిచెపుతున్నారు. మాటల తూటాలు పేలుతున్నాయి. సవాళ్లు ప్రతి సవాళ్లతో ప్రచారం హోరెత్తుతోంది. మొదటి నుండి ఈటెల తన మార్క్ ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేలా పడ్డారు. ఈ తరుణంలో మరోసారి కేసీఆర్ సర్కార్ ఫై విరుచుకపడ్డారు. తెలంగాణ గడ్డపై ఎగిరేది కాషాయ జెండాయే అని అన్నారు. రానున్న ఎన్నికల్లో గెలిచేది బీజేపీయేనని స్పష్టం చేశారు.

తాము కళ్లు తెరిస్తే మాడి మసైపోతారని ప్రత్యర్థులు చేస్తున్న ఆరోపణలపై ఆయన మండిపడ్డారు. ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గర పడుతున్నందున తామేమీ మాట్లాడటం లేదని, అక్టోబర్ 30 తర్వాత ఎవరెవరు ఏం మాట్లాడారో దానిపై ప్రతీకారం తీర్చుకుంటామన్నారు ఈటల. హుజూరాబాద్ నియోజకవర్గానికి దళితబంధు, పెన్షన్లు సహా ఇతర పథకాలు రావడానికి తానే కారణమని ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. నాడు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓటేయలేదని, తెచ్చిన పార్టీని గెలిపించారన్నారు. ఇప్పుడు కూడా పథకాలు ఇస్తోంది కేసీఆర్ అయినా.. తెచ్చింది మాత్రం తానేనని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.