నేడు జగన్ ‘సిద్ధం’ చివరి సభ..

ఈరోజు బాపట్ల జిల్లా మేదరమెట్ల వేదికగా వైసీపీ ఎన్నికల సన్నాహక సభ జరగనుంది. ఆఖరి సిద్ధం సభకు పి.గుడిపాడు ముస్తాబైంది.ఈ సభకు 15లక్షల మంది ప్రజలు వస్తారని అంచనా. ఈ సభలో వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోపై జగన్‌ మాట్లాడే అవకాశం ఉంది.

నిన్నటి వరకు టిడిపి – జనసేన ఫైన విమర్శలు చేసిన జగన్..ఇప్పుడు బిజెపి ఫై కూడా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ఆ పార్టీ కూడా టిడిపి కూటమితో జత కలిసింది కాబట్టి. గతంలో 2014 ఎన్నికల్లో ఇదే కూటమి నుంచి సవాల్ ఎదుర్కొన్న జగన్.. అధికారానికి దూరమయ్యారు. ఇప్పుడు మరోసారి ఇదే కూటమిని ఎదుర్కోవాల్సిన పరిస్ధితుల్లో ఎలా వ్యవహరించాలనే దానిపై జగన్ క్యాడర్ కు దిశానిర్దేశం చేసేందుకు సిద్దమయ్యారు.

ఇప్పటికే వైసీపీ లో జోష్ పెంచేందుకు గాను భీమిలి, ఏలూరు, రాప్తాడులో మూడు సిద్ధం సభల్ని నిర్వహించిన జగన్..ఈరోజు మేదరమెట్ల వద్ద నిర్వహించే ఆఖరి సభకు రాష్ట్రంలో కనీవినీ ఎరుగని రీతిలో దాదాపు 15 లక్షల మందిని రప్పించేందుకు ఏర్పాట్లు చేసారు. ఈ సభలో సీఎం జగన్ ప్రసంగం కీలకంగా మారనుంది.

ఇక ఈ ‘సిద్ధం’ ఆఖరి సభలో గ్రీన్ మ్యాట్లు వేయడంపై టీడీపీ విమర్శలు గుప్పించింది. ‘బాహుబలి సినిమాకి కూడా ఈ రేంజ్లో గ్రీన్ మ్యాట్లు వేసుండరు. వీటితో ఎడిటింగ్ చేసి జనాలు ఫుల్గా ఉన్నట్లు చూపిస్తారు. అందుకే లైవ్ 40 నిమిషాలు లేటుగా వస్తుంది. కానీ అక్కడ విలేకరులు తీసే వీడియోలో జనం ఉండరు. అందుకే వాళ్లని కొడతారు’ అని ట్వీట్ చేసింది. దీనికి స్పందించిన వైసీపీ ‘భయం పట్టుకున్నట్లు ఉంది’ అని కామెంట్ చేసింది.