చెలరేగిన గైక్వాడ్‌

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుపై చెన్నై సూపర్‌కింగ్స్‌ విజయం

Chennai Super Kings win
Chennai Super Kings win

దుబాయ్: ఐపిఎల్‌ పోరులో భాగంగా ఆదివారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ విజయం సాధించింది.

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరుపై 8 వికెట్ల తేడాతో విజయాన్ని సొంతంచేసుకుంది. తొలుత బెంగళూరు నిర్దేశించిన 146 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సూపర్‌కింగ్స్‌మరో 8 పరుగులు ఉండగానే విజయంసాధించింది..

ఈ మ్యాచ్‌లో కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయింది.. ఇదిలా ఉండగా పీలవమైన ఫీల్డింగ్‌ బెంగళూరు నట్టేట ముంచింది..

చెన్నై ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ 51 బంతుల్లో 65 పరుగులు (4 ఫోర్లు, 3 సిక్సర్లు) సాధించాడు.

కెప్టెన్‌ ధోనీ 21 బంతుల్లో 19 పరుగులు చేశాడు..డుప్లెసిస్‌ 25 (13), అంబటి రాయుడు 39(27 బంతులు) పరుగులు చేశారు.

కాగా బెంగళూరు 20 ఓవర్లలో 145పరుగులు 6 వికెట్ల నష్టంతో చేసింది.. కోహ్లీ 50, డివిలియర్స్‌ 39, పడిక్కల్‌ 22 పరుగులుచేశారు..

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/