సీఎం జగన్ కుప్పం టూర్ ఫిక్స్..

jagan kuppam

ఏపీ సీఎం , వైస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి కుప్పం టూర్ ఫిక్స్ అయ్యింది. ప్రస్తుతం ఏపీలో రాజకీయ వేడి కాకరేపుతుంది. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుండే అన్ని పార్టీల నేతలు వరుస నియోజకవర్గాల టూర్ లతో ఎన్నికల సందడి మొదలుపెడుతున్నారు. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలని టీడీపీ చూస్తుంటే..175 కు 175 సీట్లు సాధించి టీడీపీ మాత్రమే కాదు మారే ఏ పార్టీ కి అడ్రెస్ లేకుండా చేయాలనీ జగన్ చూస్తున్నాడు. అందుకే పక్క ప్లాన్ తో ముందుకు వెళ్తున్నారు.

ముఖ్యంగా చంద్రబాబు అడ్డా అయినా కుప్పం ఫై గట్టిగా ఫోకస్ చేసారు. ఎలాగైనా కుప్పంలో బాబు ను ఓడించాలని చూస్తున్నాడు. అందుకే గతంలో ఎన్నడూ లేని విధంగా కుప్పంలో పలు అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంతే కాదు ఇప్పుడు కుప్పంలో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. ఈ నెల 22వ తేదీన ముఖ్యమంత్రి జగన్ కుప్పం రానున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కుప్పం మునిసిపాలిటీలో రూ.66 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసేందుకు సీఎం హాజరవుతున్నట్లు పార్టీ కీలక నేతలు వెల్లడించారు. ఈ మేరకు జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ భరత్ ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి పలు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం జగన్ హెలికాప్టర్‌లో కుప్పంకు రానున్న నేపథ్యంలో ఇరు నేతలు హెలిప్యాడ్ స్థలాలను పరిశీలించారు.

కుప్పం మునిసిపాలిటీతో పాటు పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లోనూ వైఎస్సార్‌సీపీ అత్యధిక సీట్లు సాధించిన సంగతి తెలిసిందే. దాంతో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కుప్పం సీటును కూడా కైవసం చేసుకోవాలని వైఎస్సార్‌సీపీ ఉవ్విళ్లూరుతోంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పంపైనే పూర్తి దృష్టి సారించారు. రీసెంట్ గా చంద్రబాబు కుప్పం లో పర్యటించగా అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అన్న క్యాంటిన్ ను ధ్వసం చేయడం..టీడీపీ ప్లెక్సీ లు కాల్చేయడం, చంద్రబాబు కు వ్యతిరేకంగా నినాదాలు చేయడం వంటివి వైస్సార్సీపీ కార్యకర్తలు చేసారు. మరి ఇప్పుడు జగన్ పర్యటన నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు ఏంచేస్తారో చూడాలి.