బీజేపీకి కన్నా రాజీనామా చేయబోతున్నారా.?

ఏపీ రాష్ట్ర మాజీ బిజెపి అధ్యక్షుడు , బిజెపి నేత కన్నా లక్ష్మీ నారాయణ బిజెపి పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ నెల 26 ఆయన జనసేన పార్టీలోకి వెళ్ళబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అందుకే బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలకు దూరంగా కన్నా లక్ష్మీనారాయణ ఉన్నారని , తిరుపతి మొక్కుబడి తో దూరంగా ఉన్నాన్న కన్నా….. ఇప్పుడు సమావేశాలకు హాజరు కాలేనని వివరించారు.

గతకొంత కాలంగా కన్నా పార్టీ వీడతారని ప్రచారం జరుగుతోంది. పెదకూరపాడు నియోజకవర్గం బిజెపి నేతలు కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో బిజెపికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇదే క్రమంలో జనసేన పార్టీ లోకి వెళ్ళబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. ఆ మధ్య మనోహర్ సైతం కన్నా లక్ష్మీ నారాయణ తో భేటీ అయ్యి..జనసేన పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో బిజెపి జోరు పెద్దగా లేదు. ముఖ్యంగా జనసేన vs వైస్సార్సీపీ మధ్యనే వార్ నడుస్తుంది. ఈ క్రమంలో పలువురు ఇతర పార్టీ నేతలతో పాటు అధికార పార్టీలోని కొంతమంది జనసేన వైపు చూస్తున్నట్లు సమాచారం.