పొత్తుల కోసం దిగజారుడు రాజకీయాలు చేస్తారు – సీఎం జగన్

బుధువారం కాకినాడ లో వైస్సార్ పెన్షన్ పెంపు కార్యక్రమంలో పాల్గొన్న జగన్.. చంద్రబాబు , పవన్ కళ్యాణ్ ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు. చంద్రబాబు పాలనలో పింఛన్‌ కేవలం రూ.వెయ్యి మాత్రమేనని.. . ఎన్నికల ముందు జగన్‌ హామీ ఇవ్వకుండా ఉంటే చంద్రబాబు పెన్షన్‌ పెంచేవారా? అని ప్రశ్నించారు. గతంలో జన్మభూమి కమిటీల ద్వారా అర్హులను నిర్ణయించే వారని.. చంద్రబాబు హయాంలో పింంఛన్‌ తీసుకోవాలంటే లంచం ఇస్తే తప్ప పని జరిగేది కాదన్నారు. అర్హత ఉంటే చాలు అందరికీ పింఛన్‌ ఇస్తున్నామని.. గతానికి, ఈ ప్రభుత్వానికి తేడాను గమనించాలన్నారు. చంద్రబాబు ఎన్నికల రెండు నెలల ముందు వరకు కేవలం రూ.1000 పెన్షన్‌ ఇచ్చారని.. ఇచ్చిన మాట ప్రకారం తాము పింఛన్ పెంచుకూంటూ రూ.3వేలు అందిస్తున్నామన్నారు. బాబు నెలకు రూ.400కోట్లు ఇచ్చారని.. ఇప్పుడు రూ.2వేల కోట్లు ఇస్తున్నామన్నారు.

చంద్రబాబు, పవన్‌ కలిసి 2014లో ఎన్నో హామీలు ఇచ్చారు పేదవారికి 3 సెంట్ల భూమి ఇస్తామని హామీ ఇచ్చి ఒక్క సెంటు కూడా ఇ‍వ్వలేదని జగన్ మండిపడ్డారు. పశ్నిస్తానన్న దత్త పుత్రుడు కనీసం లేఖ కూడా రాయలేదన్నారు. చంద్రబాబు అవినీతిపై దత్తపుత్రుడు ఎందుకు మాట్లాడరు. చంద్రబాబు అవినీతిలో పవన్‌ కూడా పార్ట్‌నరే అని జగన్ కీలక వ్యాఖ్యల చేసారు. చంద్రబాబు అవినీతిపై కొన్ని మీడియా పత్రికలు, ఛానల్స్ ఎందుకు రాయవో చెప్పాలన్నారు. అవినీతికి పాల్పడిన చంద్రబాబును జైలుకెళ్లి దత్తపుత్రుడు పరామర్శించారని.. ఇళ్ల నిర్మాణాన్ని ఆపాలనే దత్తపుత్రుడి దిక్కుమాలిన ఆలోచన అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబు అవినీతిలో పార్ట్‌నర్‌ కాబట్టే దత్తపుత్రుడు ప్రశ్నించరన్నారు.

ప్రతీ గ్రామంలో సచివాలయం తెచ్చాం. ప్రతీ గ్రామంలోనూ వాలంటీర్‌ వ్యవస్థను తీసుకొచ్చామని గుర్తు చేశారు. ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు ప్రతీ గ్రామంలో మార్పు తెచ్చామన్నారు. ఆర్బీకే, విలేజ్‌ క్లినిక్‌, జగనన్న ఆరోగ్య సురక్ష తీసుకొచ్చామని.. నాడు-నేడుతో పాఠశాలలను ఆధునీకరించామన్నారు. అదే రాష్ట్రం, అదే బడ్జెట్‌. కేవలం మారిందల్లా ప్రభుత్వమే మాత్రమేనని.. చంద్రబాబు హయాంలో ఇవన్నీ ఎందుకు జరగలేదన్నారు.