చిమ్మ చీకట్లోనే పవన్ ర్యాలీ

జనవాణి కార్యక్రమంలో పాల్గొనేందుకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విశాఖకు వచ్చారు. ఎయిర్ పోర్ట్ లో తమ అధినేతకు అభిమానులు , కార్య కర్తలు ఘన స్వాగతం పలికారు. ఎయిర్ పోర్ట్ నుండి ర్యాలీగా బయలుదేరిన పవన్ కళ్యాణ్ కు షాక్ తగిలింది. ర్యాలీ గా వస్తున్న దారిలో స్ట్రీట్ లైట్లు వెలుగలేదు. చీకట్లోనే పవన్ తన ర్యాలీ ని కొనసాగించారు. చాల దూరం ఆలా చీకట్లోనే వచ్చారు. ఆ తర్వాత స్ట్రీట్ లైట్లు వెలిగాయి. పవన్ చీకట్లో వస్తూనే అభిమానులు తమ ఫోన్ లైట్ తో దారి ఇచ్చారు.

అంతకు ముందు ఎయిర్ పోర్ట్ లో వైస్సార్సీపీ నేతలకు జనసేన కార్య కర్తలు షాక్ ఇచ్చారు. అధికార వికేంద్రీక‌ర‌ణ‌కు మ‌ద్ద‌తుగా విశాఖ లో వైస్సార్సీపీ విశాఖ గ‌ర్జ‌న‌ కు మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ గర్జన కు వైస్సార్సీపీ నేతలు , కార్య కర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. మంత్రులు , నేతలు తిరిగి వెళుతున్న స‌మ‌యంలో వారి కార్ల‌పై జ‌నసేన కార్య‌క‌ర్త‌లు దాడికి పాల్ప‌డ్డారు. ఈ దాడిలో సుబ్బారెడ్డితో పాటు మంత్రుల కార్ల అద్దాలు ధ్వంస‌మ‌య్యాయి. మంత్రులు జోగి రమేశ్‌, రోజా కార్ల అద్దాలను జనసైనికులు ధ్వంసం చేశారు. కార్లపై పిడిగుద్దులతో జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఊహించని అటాక్‌తో మంత్రులు, నేతలు షాక్ కు గురయ్యారు. రోజా కారుపై జనసేన మహిళా కార్యకర్తలు చెప్పులు, చీపుర్లను విసిరారు.