రేపటి నుండి మూడు రోజుల పాటు కడపలో జగన్ పర్యటన

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి , వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మూడు రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించబోతున్నారు. రేపు (డిసెంబర్ 23) ఉదయం 11 గంటల ప్రాంతంలో గన్నవరం నుంచి ప్రొద్దుటూరు బయలుదేరనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. రేపు సాయంత్రం ఇడుపులపాయ ఎస్టేట్ లో బస చేస్తారు.

ఇక 24 న ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించనున్నారు. ఆ తర్వాత ఆదిత్య బిర్లా యూనిట్ కు శంకుస్థాపన చేయనున్నారు. ఇక 25వ తేదీన ఉదయం పులివెందుల సి ఎస్ ఐ… చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో భార్య భారతి తో కలిసి పాల్గొననున్నారు. ఆ రోజు సాయంత్రం తిరిగి తాడిపల్లె గూడెం చేరనున్నారు. జగన్ పర్యటన నిమిత్తం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే కడప జిల్లా నేతలు , కార్య కర్తలు జగన్ కు స్వాగతం పలికేందుకు ఆ పనులలో బిజీ గా ఉన్నారు.

ఇక మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తణుకులో లాంఛనంగా ప్రారంభించారు. జిల్లావ్యాప్తంగా సుమారు 25 వేల మందికి పత్రాలు పంపిణీ చేయడం జరిగింది.

ఈ సందర్బంగా జగన్ మాట్లాడుతూ..ఇల్లు అంటే కేవలం ఇటుకలు, సిమెంట్‌తో నిర్మించిన కట్టడం మాత్రమే కాదని ఒక మనిషి సుదీర్ఘకాలం పడిన కష్టానికి, సంతోషానికి సజీవ సాక్ష్యం లాంటిదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ.26 వేల కోట్ల విలువైన భూమిని 31 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ఇళ్ల స్థలాల కింద ప్రభుత్వం పంపిణీ చేసిందని చెప్పారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ద్వారా పేదలకు స్థిరాస్తిపై వివాదరహితంగా, క్లియర్‌ టైటిల్‌తో సర్వహక్కులూ కల్పిస్తూ రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు తెలిపారు.

ఇక 24వ తేదీన ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించ నున్నారు. అనంతరం ఆదిత్య బిర్లా యూనిట్ కు శంకుస్థాపన చేస్తారు సీఎం జగన్. ఇక 25వ తేదీన ఉదయం పులివెందుల సి ఎస్ ఐ… చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు సీఎం జగన్. సీఎం జగన్ తో పాటు ఆ రోజున వైఎస్ భారతి కూడా పాల్గొని ఛాన్స్ ఉంది. ఇక 25న సాయంత్రం తిరిగి తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ కు సీఎం జగన్ వెళ్లనున్నారు.