నవంబర్‌ 3న దుబ్బాక ఉప ఎన్నికల పోలింగ్‌

అక్టోబరు 9న నోటిఫికేషన్

election commission

హైదరాబాద్‌: తెలంగాణలోని దుబ్బాక అసెంబ్లీ నియోజవర్గ ఉప ఎన్నిక పోలింగ్‌ తేదీ ఖరారైంది. నవంబర్‌ 3న పోలింగ్‌ నిర్వహస్తామని కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం ప్రకటించింది. అక్టోబరు 9న ఈ ఉప ఎన్నిక నోటిఫికేషన్ వెలువడనుంది. అక్టోబరు 16వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఆ మరుసటి రోజు అంటే అక్టోబరు 17న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు చివరి తేదీ అక్టోబరు 19. నవంబరు 10న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలైన టిఆర్‌ఎస్‌, బిజెపి, కాంగ్రెస్ ఈ ఉప ఎన్నికకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇప్పటికే ప్రచారం షురూ చేశాయి. అయితే షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో, ఇవాళ్టి నుంచి దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో కోడ్ అమలు కానుంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/