గోపాలరావు కు ‘పద్మశ్రీ ‘ అభినందనీయం

పవన్ కల్యాణ్ స్పందన

అమరావతి : తెలుగు రాష్ట్రాల్లో పద్యనాటక రంగంలో ప్రముఖ కళాకారుడిగా పేరొందిన యడ్ల గోపాలరావును ప్రతిష్ఠాత్మక పద్మశ్రీ వరించింది. ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా యడ్ల గోపాలరావు పద్మ పురస్కారం అందుకున్నారు. యడ్ల గోపాలరావును ఈ సందర్భగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి సత్కరించారు. దీనిపై జనసేనాని పవన్ కల్యాణ్ స్పందించారు. పద్మ అవార్డు అందుకున్న యడ్ల గోపాలరావు గారికి హృదయపూర్వక అభినందనలు అంటూ ట్వీట్ చేశారు.

“ఎంతోమంది విశిష్ట వ్యక్తులను ప్రతిష్ఠాత్మక అవార్డుల కోసం పరిగణనలోకి తీసుకుంటున్న బీజేపీ కేంద్ర నాయకత్వాన్ని అభినందిస్తున్నాను. కేంద్రం గుర్తింపు అందుకున్న వారిలో పాకిస్థాన్ సైనికాధికారి లెఫ్టినెంట్ కల్నల్ ఖ్వాజీ సజ్జాద్ అలీ జాహిర్ కూడా ఉండడం విశేషం” అని పవన్ తెలిపారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/