కృష్ణా జిల్లాలో జగన్ కటౌట్ ను కాల్చేసిన దుండగులు

,

కృష్ణా జిల్లాలో సీఎం జగన్ కటౌట్ కు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టిన ఘటన ఫై రాజకీయంగా చర్చకు దారితీసింది. మచిలీపట్నం-విజయవాడ జాతీయ రహదారి పక్కన గూడురు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద ఈ కటౌట్ ను వైస్సార్సీపీ శ్రేణులు ఏర్పాటు చేశాయి. కాగా అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని దుండగులు కటౌట్ కు నిప్పంటించారు. దీంతో ముఖ్యమంత్రి కటౌట్ సగం కాలింది. ఈ ఘటన పట్ల వైస్సార్సీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

విషయం తెలుసుకున్న బందరు డీఎస్సీ బాషా, పెడన రూరల్ సీఐ ప్రసన్న గౌడ్, గూడూరు ఎస్సై వెంకట్ ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. పెడనలో చేనేత కార్మికులకు చేయూత పథకాన్ని ఇవ్వడానికి జగన్ వచ్చిన సందర్భంగా ఈ కటౌట్ ను ఏర్పాటు చేశారు. ఈ ఘటనపై స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ కారుమంచి కామేశ్వరరావు మాట్లాడుతూ… ఇది దుర్మార్గమైన చర్య అని అన్నారు. రాజకీయాల్లో అనేక గొడవలు ఉంటాయి కానీ, కటౌట్లకు నిప్పు అంటించడమనేది సరైనది కాదని అనాన్రు. దీనిపై డీఎస్సీ బాషా దర్యాప్తు మొదలుపెట్టారు.