రొమాంటిక్ ఫోజులో మెస్మరైజ్

‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్’ పోస్ట‌ర్ వి‌డుద‌ల

రొమాంటిక్ ఫోజులో మెస్మరైజ్
Poster from Most Eligible Bachelor

అఖిల్ అక్కినేని హీరోగా మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై తెర‌కెక్కుతున్న చిత్రం “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్”.

టాలెంటెడ్ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో రెడీ అవుతున్న ఈ సినిమాకి ప్రొడ్యూసర్ గా క్రేజ్ ని సొంతం చేసుకున్న‌ బన్నీ వాసు, నిర్మాత ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వాసు వర్మ తో కలిసి నిర్మిస్తున్నారు.

ఈ ప్రాజెక్ట్ లో అఖిల్ అక్కినేని సరసన బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.

ఇది ఇలా ఉంటే “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్” సినిమా అనౌన్స్ ఐనా దగ్గర నుంచి అక్కినేని అభిమానుల్లో ఫుల్ క్రేజ్ ఏర్పడిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ టీం విడుదల చేసిన అఖిల్ అక్కినేని ఫస్ట్ లుక్ కు, పూజా హెగ్డే ఫస్ట్ లుక్ కు అటు సోషల్ మీడియా లో ఇటు అభిమానుల్లో అనూహ్యమైన స్పందన లభించింది.

ఇదే ఉత్సాహంతో అక్కినేని అభిమానులకు స్పెషల్ సర్ప్రైజ్ ఇస్తూ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ టీం తాజగా ఈ సినిమాకు సంబంధించిన కపుల్ పోస్టర్ ని విడుదల చేసింది

ఈరోజు వి‌డుద‌ల చేసిన పోస్ట‌ర్ లో అక్కినేని న‌ట‌వార‌సుడు అఖిల్ అక్కినేని వర్క్ చేసుకుంటూ ఉంటే వెనక నుంచి బుట్ట బొమ్మ పూజా హెగ్డే టీజ్ చేసే ఈ స్టిల్ చూస్తే యూత్ లో ఒక తెలియ‌ని రొమాంటిక్ ఫీల్ వ‌స్తుంది.

ద‌ర్శ‌కుడు బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ త‌న చిత్రాల్లో పాత్ర‌లు చాలా క్యూట్ రొమాన్స్ తో ల‌వ్ లీగా వుండే కేర‌క్ట‌ర్స్ ని డిజైన్ చేస్తారు.

అందుకే ఆయ‌న చిత్రాల‌కి ఓ స్పెషాలిటి వుంటుంది. అఖిల్ అక్కినేని పూజా ల మ‌ద్య ఎలాంటి కెమిస్ట్రి వుండ‌బోతుందో ఈ పోస్ట‌ర్ డిజైనింగ్ లో చాలా చ‌క్క‌గా చూపించారు ద‌ర్శ‌కుడు.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/