చంద్రబాబు ఏడుపు ఫై జగన్ కామెంట్స్

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అసెంబ్లీ, ప్రెస్‌ మీట్‌ లో ఎడవటం పై సీఎం జగన్‌ అసెంబ్లీలో సెటైర్లు వేశారు. చంద్రబాబు కళ్లల్లో నీళ్లు లేకపోయినా… నీళ్లు వచ్చాయని జగన్ అన్నారు. చంద్రబాబు ఏడుపు పెద్ద డ్రామా అని… అన్ని రాజకీయాల కోసమేనని మండిపడ్డారు. దేవుడి దయ, ప్రజల దీవెన ఉన్నంత కాలం.. ఎల్లో మీడియా ఏం చేయలేదన్నారు. రైతుల చర్చలో విపక్ష సభ్యులు లేకపోవడం దుర దృష్టకరమన్నారు. చంద్రబాబు సంబంధం లేని విషయాలను తీసుకు వచ్చి రెచ్చగొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వంగవీటి రంగ హత్య, మాధవ రెడ్డి హత్య చంద్రబాబు హాయంలోనే జరిగాయాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.

అంతకు ముందుకు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన చంద్రబాబు..ఆఫీస్ లో ప్రెస్ మీట్ ఏర్పటు చేసి మీడియా ముఖంగా కన్నీరు పెట్టుకున్నారు. నా రాజకీయ జీవితంలో ఇంత బాధ ఎప్పుడూ భరించలేదు. రెండున్నరేళ్ల నుంచి అన్నివిధాలా అవమానిస్తున్నారు. ఆర్థికంగా, రాజకీయంగా పార్టీని, నేతలను ఎన్నో ఇబ్బందులు పెట్టినా భరించాం. బూతులు తిట్టినా, ఎన్ని అవమానాలకు గురిచేసినా భరించాం. నిన్న కూడా బీఏసీలో సీఎం అవహేళనగా మాట్లాడారు. ఈరోజు ఏకంకా నా భార్యను కించపరిచేలా దూషించారు. నా భార్య ఏరోజూ రాజకీయాల్లోకి రాలేదు. నా వెనుక ఉంటూ నన్ను ప్రోత్సహించింది. కానీ రాజకీయాల్లోకి రాలేదు.

నిండు కౌరవసభలో ఆనాడు ద్రౌపదికి అవమానం జరిగింది. ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా బాధ్యతగా భావించా. ఈ కౌరవ సభ… గౌరవం లేని సభ. గతంలో వైఎస్‌ కూడా అసెంబ్లీలో నా తల్లిని అవమానించారు. ఆనాడు వైఎస్‌ తప్పు ఒప్పుకొని నాకు క్షమాపణ చెప్పారు: జగన్‌ ప్రజల పాలిట భస్మాసురుడిగా మారారు: ఇవాళ్టి ఘటనలను ఏవిధంగా అభివర్ణించాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేసారు.