జనగామ ఎమ్మెల్యే.. కబ్జారెడ్డి అంటూ వైఎస్ షర్మిల ఫైర్

మరోసారి వైఎస్ షర్మిల తన పాదయాత్ర లో అధికార పార్టీ నేతలను టార్గెట్ చేస్తుంది. గత కొద్దీ రోజులుగా షర్మిల ప్రజాప్రస్థానం పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ యాత్ర జనగామ నియోజకవర్గంలో కొనసాగుతుంది. ప్రజల కష్టాలను అడిగితెలుసుకుంటూనే..అధికార పార్టీ ఫై , పార్టీ నేతలపై నిప్పులు చెరుగుతూ యాత్ర ను కొనసాగిస్తున్నారు. ఈ యాత్రలో ఆమె మాట్లాడుతూ..జనగామ ఎమ్మెల్యే.. ముత్తిరెడ్డి కాదు కబ్జారెడ్డి అని ఫైర్ అయ్యారు.

500 ఎకరాలకు తక్కువ లేకుండా కబ్జా చేశాడట. కేసీఆర్ ఒక్క ఫామ్ హౌజ్ కట్టుకుంటే, ఈయన 3 ఫామ్ హౌజ్ లు కట్టుకున్నాడట. కలెక్టర్ సైతం కబ్జాకోరు అని రిపోర్ట్ ఇస్తే.. కేసీఆర్ అండదండలతో ట్రాన్స్ ఫర్ చేయించాడట అంటూ నిప్పులు చెరిగింది. అందుకే బీఆర్ఎస్ అంటే బంధిపోట్ల రాష్ట్ర సమితి అంటూ ఫైర్‌ అయ్యారు. అసెంబ్లీలో కేసీఆర్ నిస్సుగ్గుగా వైస్సార్ గురించి తప్పుడు కూతలు కూస్తున్నాడు. తెలంగాణలో జలయజ్ఞం ద్వారా 33 ప్రాజెక్టులు నిర్మించి, లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చిన ఘనత వైస్సార్ గారిది అయితే కమీషన్ల కోసం కాళేశ్వరం కట్టి కొత్తగా ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వకుండా మూడేండ్లకే ప్రాజెక్టును ముంచిన చరిత్ర నీది. ఫామ్ హౌజ్ మత్తులో ప్రగతిభవన్ లో డాన్సులు వేస్తూ.. అసెంబ్లీలో తప్పుడు కూతలు కూస్తే ఖబడ్దార్ అని హెచ్చరించారు షర్మిల.

అలాగే రేవంత్ రెడ్డి ఫై కాంగ్రెస్ ఫై మండిపడ్డారు షర్మిల. కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓట్లు వేస్తే.. ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా మూకుమ్మడిగా కేసీఆర్ కు అమ్ముడుపోయారు. అలాంటి పార్టీకి ఓట్లు వేయాల్నా? ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ.. కేసీఆర్ చేతిలో పిలకలా మారి, నేడు దొంగ యాత్రలు చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీని నమ్మితే.. అధోగతే అని ఎద్దేవా చేసారు.