నేడు సుప్రీం కోర్టులో జగన్‌ బెయిల్‌ రద్దు పై విచారణ

cm-jagan

అమరావతిః ఏపీ ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ పిటిషన్ ను నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారించనుంది. మరోవైపు, జగన్ కేసుల విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ రఘురాజు మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ రెండు పిటిషన్లను కలిపి ధర్మాసనం విచారించనుంది. విచారణ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

మరోవైపు, ఈ ఎన్నికల్లో కూటమి తరపున పోటీ చేయాలని భావించిన రఘురాజుకు నిరాశ ఎదురయింది. పొత్తులో భాగంగా నర్సాపురం స్థానం బీజేపీ తీసుకుంది. ఆ స్థానంలో శ్రీనివాస వర్మ పేరును బిజెపి ప్రకటించింది. అయితే, తనకు టికెట్ దక్కుతుందనే ఆశాభావంలోనే రఘురాజు ఉన్నారు. టికెట్ రాకపోతే… తాను ఇండిపెండెంట్ గా పోటీ చేయనని చెప్పారు.