అమిత్ షాతో కూడా ప్రమాణం చేయిస్తారా..బండి సంజయ్..? -మంత్రి జగదీష్

యాదాద్రి గుడిలో ప్రమాణం చేసిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ని టిఆర్ఎస్ మంత్రి జగదీష్ రెడ్డి సూటి ప్రశ్న వేశారు. బండి సంజయ్.. ఇప్పుడు అమిత్ షాతో కూడా ప్రమాణం చేయిస్తారా?” అంటూ మంత్రి జగదీశ్ రెడ్డి నిలదీశారు. బీజేపీ కుట్రలను తమ పార్టీ ఎమ్మెల్యేలు బట్టబయలు చేశారని, దొంగలను విజయవంతంగా పట్టుకున్నారని .. బండి సంజయ్ బొక్కబోర్లాపడ్డారని మంత్రి జగదీశ్ రెడ్డి ఎద్దేవా చేశారు.

టిఆర్ఎస్ ఎమ్మెల్యే లను బిజెపి కొనుగోలు చేసేందుకు ట్రై చేసిందనే ఆరోపణలను బిజెపి కొట్టిపారేసింది. ఈ ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని బండి సంజయ్ అన్నారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్‌ బండి సంజయ్ ఓ సవాల్ విసిరారు. ఫామ్‌హౌస్ వ్యవహారంతో తమకు సంబంధం లేదని తాను యాదాద్రిలో ప్రమాణ స్వీకారం చేస్తానని.. సీఎం కేసీఆర్‌కు దమ్ముంటే ఆయన కూడా రావాలని ఛాలెంజ్ విసిరారు. బండి సంజయ్ విసిరినా సవాల్ ఫై కేసీఆర్ స్పందించనప్పటికీ..బండి సంజయ్ మాత్రం చెప్పినట్లే యాదాద్రి లో ప్రమాణం చేసారు.

యాదాద్రికి చేరుకున్న బండి సంజయ్ ముందుగా గుండంలో స్నానం చేసి తడి బట్టలతో ఆలయానికి చేరుకున్నారు. స్వామివారి సన్నిధిలో తడి బట్టలతో ప్రమాణం చేశారు. ఫామ్ హౌస్ డీల్ తమది కాదని ఆయన స్వామివారి పాదాల దగ్గర ప్రమాణం చేశారు. అయితే ఈ ప్రమాదం ఫై మంత్రి జగదీశ్ స్పందించారు.

గుళ్లో ప్రమాణం చేయమని బండి సంజయ్ ని ఎవరడిగారని జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు. గుమ్మడికాయ దొంగ ఎవరంటే బీజేపీ వాళ్లు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారని జగదీశ్ రెడ్డి విమర్శించారు. “మునుగోడు గడ్డపై అమిత్ షా చెప్పిన మాటలను నిజం చేసే ప్రయత్నంలో అడ్డంగా బుక్ అయ్యారు. బండి సంజయ్ ఇప్పుడు అమిత్ షాతో కూడా ప్రమాణం చేయిస్తారా?” అంటూ మంత్రి జగదీశ్ రెడ్డి నిలదీశారు. బీజేపీ కుట్రలను తమ పార్టీ ఎమ్మెల్యేలు బట్టబయలు చేశారని, దొంగలను విజయవంతంగా పట్టుకున్నారని వెల్లడించారు. బండి సంజయ్ బొక్కబోర్లాపడ్డారని మంత్రి జగదీశ్ రెడ్డి ఎద్దేవా చేశారు. మొయినాబాద్ ఫాంహౌస్ లో ప్రలోభాలపై వాస్తవాలు బయటికి వస్తున్నాయని, బీజేపీ నేతలు దోషులు అయ్యారని జగదీశ్ రెడ్డి వివరించారు. దీనిపై చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు.