జమ్ముకశ్మీర్‌లో ఎన్ కౌంటర్.. ఐదుగురు జ‌వాన్ల వీర‌మ‌ర‌ణం

జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ సెక్టార్‌లో ఘ‌ట‌న‌

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ సెక్టార్‌లో ఉగ్రవాదులతో పోరాడుతూ ఐదుగురు భార‌త జ‌వాన్లు వీర‌మ‌ర‌ణం పొందారు. ఆ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నార‌ని తెలుసుకున్న భార‌త జ‌వాన్లు సెర్చ్ ఆప‌రేష‌న్ జ‌రుపుతుండ‌గా ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. మృతి చెందిన జ‌వాన్ల‌లో జూనియర్‌ కమిషన్డ్‌ అధికారి కూడా ఉన్నారు. ఉగ్ర‌వాదులు కాల్పులు జ‌ర‌ప‌డంతో భార‌త జ‌వాన్లు దీటుగా స్పందిస్తున్నారు.

పూంచ్‌ జిల్లాలోని నియంత్రణా రేఖ వెంబడి ఉన్న సురాన్‌ కోట్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయని లెఫ్టినెంట్‌ కల్నల్‌ దేవేందర్‌ ఆనంద్‌ తెలిపారు. అయితే గాలింపు బృందాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారని, దీంతో జేసీఓ సహా ఐదుగురు సైనికులు తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు. దవాఖానకు తరలిస్తుండగా వారు కన్నుమూశారని వెల్లడించారు. ప్ర‌స్తుతం కాల్పులు కొన‌సాగుతున్నాయి

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/