నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు

ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగం

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఉభయసభలనుద్దేశించి గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ ప్రసంగంతో సమావేశాలు మొదలవుతాయి. ఈ నెల 18న ప్రభుత్వం 2021-22 బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టనున్నది. గవర్నర్‌ ప్రసంగం అనంతరం జరిగే బీఏసీలో సమావేశాల పనిదినాలు, ఎజెండాను ఖరారు చేయనున్నారు. కరోనా నేపథ్యంలో సమావేశాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సభ్యులతో సహా అసెంబ్లీ సిబ్బంది, మార్షల్స్‌, మీడియా ప్రతినిధులకు ర్యాపిడ్‌ టెస్టులు చేస్తున్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/