బెర్నీ చెప్పింది చెప్పినట్టుగానే..

అంతర్జాలంలో వీడియో వైరల్‌

Bernie Sanders
Bernie Sanders

Washington: అమెరికా అధ్యక్ష ఎన్నికలు, ఫలితాలపై ఇటీవల డెమోక్రటిక్‌ సెనేటర్‌ బెర్నీ సాండర్స్‌ చెప్పింది చెప్పినట్టుగా జరుగుతూ వస్తోంది.

దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు వైరల్‌ అయి కూర్చుంది.. బెర్నీ అంచనాలకు సంబంధించిన ఈ వీడియోకు 24 గంటల్లో రికార్డుస్థాయిలో 27 మిలియన్‌ వ్యూస్‌ వచ్చిపడ్డాయి.

ఇదిలా ఉండగా ఇప్పటిదాకా బెర్నీ చెప్పిందే జరుగుతోంది.

కాగా ప్రస్తుతం బైడెన్‌ అధ్యక్ష పీఠానికి కేవలం 6 ఎలక్టోరల్‌ ఓట్ల దూరంలో ఉన్నారు. తన ప్రత్యర్ధి ట్రంప్‌కు ఈసారి అధికారం దక్కటం అసాధ్యమనే వాఖ్యలు విశ్లేషకుల నుంచి వస్తోంది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/