ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపిన మంత్రి​ పువ్వాడ

హైదరాబాద్: పీఎస్‌ఎల్‌వీ సీ-52 రాకెట్‌ ప్రయోగాన్ని విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అభినందనలు తెలిపారు. ఈ విజయంతో అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా భారత అంతరిక్ష సామర్థ్యాలను ఇస్రో మరింత ముందుకు తీసుకెళ్లతుందని మంత్రి పేర్కొన్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈ ఏడాది తొలి విజయాన్ని అందుకున్న సందర్భంగా భవిష్యత్‌లో ఇస్రో చేపట్టే అన్ని ప్రయోగాలు విజయం సాధించాలని మంత్రి అజయ్ కుమార్ ఆకాంక్షించారు. శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ అంతరిక్ష ప్రయోగం కేంద్రం నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/