మైక్రోసాఫ్ట్ చైర్మ‌న్‌గా స‌త్య నాదెళ్ల‌ నియామకం

వాషింగ్ట‌న్‌: టెక్ దిగ్గ‌జం మైక్రోసాఫ్ట్ కు కొత్త చైర్మ‌న్‌గా స‌త్య‌నాదేళ్ల‌ నియమితులయ్యారు. బోర్డ్ ఆఫ్ డైరెక్ట‌ర్స్ స‌త్య‌నాదేళ్లను ఏక‌గ్రీవంగా ఎన్నుకున్న‌ట్లు బుధ‌వారం మైక్రోసాఫ్ట్ కార్పొరేష‌న్ వెల్ల‌డించింది. ప్ర‌స్తుతం ఛైర్మ‌న్‌గా ఉన్న జాన్ డ‌బ్ల్యూ థామ్స‌న్‌ను స్వ‌తంత్ర డైరెక్ట‌ర్‌గా నియ‌మించింది. ఇంత‌కుముందు కూడా థామ్స‌న్ 2012 నుంచి 2014 వ‌ర‌కు ఈ ప‌ద‌విలో కొన‌సాగారు.

కాగా, స‌త్య‌నాదేళ్ల 2014 నుంచి మైక్రోసాఫ్ట్ సీఈఓగా కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. స్టీవ్ బాల్మెర్ స్థానంలో స‌త్య‌నాదేళ్ల‌ ఈ ప‌ద‌వికి ఎంపిక‌య్యారు. ఇక సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్‌ ప్రాజెక్ట్‌ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/