క్లోరోక్విన్ వాడిన తర్వాత ట్రంప్‌కు బాగుందట

వైట్‌ హౌజ్‌ అధికార ప్రతినిధి

donald trump
donald trump

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హైడ్రాక్సీక్లోరోక్విన్ తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఔ.షధం తీసుకున్న తర్వాత తనకు ‘చాలా బాగుందని ట్రంప్ పేర్కొన్నట్లు వైట్ హౌస్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ట్రంప్ తాను కరోనా సోకిన వ్యక్తితో కలిసినట్లు ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే క్లోరోక్విన్ ఔషధాన్ని తీసుకుంటన్నట్లు వైట్ హౌస్ ప్రతినిధులు తెలిపారు.

ఇదిలా ఉంటే మలేరియా నివారణ, చికిత్స కోసం ఉపయోగించే హైడ్రాక్సీక్లోరోక్విన్, కరోనా చికిత్స కోసం యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (గీళీనీదీతి) కూడా ఆమోదించలేదు, అయితే సంక్రమణకు సంబంధించి యుఎస్ ప్రభుత్వం క్లినికల్ ట్రయల్స్ జరుపుతోంది. కరోనా వైరస్‌ పోరులో హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను ‘డైస్ రివర్సింగ్’ ఔషధంగా ట్రంప్ అభివర్ణించారు. మలేరియా నిరోధక మందులు తీసుకున్న తర్వాత ట్రంప్ ఎలా భావిస్తున్నారని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కేలీ మెకానియాను కొందరు విలేఖరులు ప్రశ్నించారు. అందుకు ఆమె ఆయనకు చాలా మంచి అనుభూతి కలిగిందని తెలిపింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/