ప్రతి రోజూ 2000 ఆహార పొట్లాలు పంపిణి

ప్రముఖ నటుడు అమితాబ్ వెల్లడి

Amitabh
Amitabh

Mumbai : ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు అమితాబ్ బ‌చ్చ‌న్ క‌రోనా సంక్షోభ స‌మ‌యంలో ముంబాయ్ లో ప్ర‌తిరోజు రెండువేల ఆహార‌పొట్లాలు పంచుతున్నారు.ఆయ‌నే ఈ విష‌యాన్ని త‌న బ్లాగ్ లో తెలిపారు

ముంబాయ్ లో ఆహారం లేక అల‌మ‌టిస్తున్న‌వారికి రోజుకి రెండుపూట్లా..లంచ్‌, డిన్న‌ర్ తాను ఏర్పాటు చేస్తున్న‌ట్టు ఆయ‌న చెప్పారు.

క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారి విరుచుకుప‌డిన‌ప్ప‌టినుంచీ ఆయ‌న ఈ విత‌ర‌ణ కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తున్నారు.

ఇంతేకాదు. ఆయ‌న మ‌రొక విత‌ర‌ణ కార్య‌క్రమాన్ని ఇప్ప‌టికే చేప‌ట్టారు.

ఆల్ ఇండియా ఫిల్మ్ ఎంప్లాయీస్ కాన్ఫెడెరేష‌న్ తో అనుబంధ‌మున్న రోజువారీ వేత‌న కార్మికుల కుటుంబాల‌కు నెల‌నెలా రేష‌న్ పంపిణీ చేస్తున్నారు.

ఇలా ల‌క్ష కుటుంబాలు రేష‌న్ ద్వారా ల‌బ్ది పొందుతున్నాయి.

తాను సొంతంగా మ‌రికొంత మందికి మూడు వేల బ్యాగుల నెల‌వారీ స‌ర‌కుల‌ను కూడా అందిస్తున్న‌ట్టు ఆయ‌న చెప్పారు. ఈ

బ్యాగుల ద్వారా దాదాపు ప‌న్నెండు వేల‌మంది ఆహార అవ‌స‌రాలు తీరుతున్న‌ట్టు కూడా త‌న బ్లాగ్ లో వెల్ల‌డించారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/