కరోనా పై పోరుకు టిక్‌టాక్‌ భారీ విరాళం

25 కోట్ల డాలర్లు కేటాయించినట్లు ప్రకటన

corona virus
corona virus

దిల్లీ: ప్రముఖ మొబైల్‌ వీడియో యాప్‌ టిక్‌టాక్‌, కరోనాపై పోరాటానికి భారీ విరాళాన్ని ప్రకటించింది. ప్రపంచం మొత్తం ఈ వైరస్‌ను ఎదుర్కోంటున్న కారణంగా నివారణ కొరకు టిక్‌టాక్‌ 25 కోట్ల డాలర్లను విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో 15 కోట్ల డాలర్లు ఆయా దేశాలలోని వైద్యులు, వైద్య సిబ్బంది, వైద్యపరికరాల కోసం అందజేస్తామని, మిగిలింది విపత్తు సమయంలో తమవంతు సేవా పాత్ర పోషస్తున్న స్వచ్చంద సంస్థలు, ఇతర విభాగాలకు కేటాయించనున్నట్లు టిక్‌టాక్‌ ప్రెసిడెంట్‌ అలెక్స్‌ జు తెలిపారు.

తాజా ఏపి వార్తల కోసం తెలపండి: https://www.vaartha.com/andhra-pradesh/