ఇరాన్‌పై ముగిసిన ఐరాస ఆంక్షలు

Iran hails ‘momentous day’ as UN arms embargo expires

టెహ్రాన్‌: యుద్ధ ట్యాంకులు, యుద్ధ విమానాల వంటి విదేశీ ఆయుధాలను కొనుగోలు చేయకుండా ఇరాన్‌పై ఐరాస విధించిన ఆంక్షలు ఆదివారంతో ముగిసిపోనున్నాయి. అమెరికా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా, ఇతర సంపన్న దేశాలతో ఆయుధాలను కొనుగోలు చేసేందుకు ఇరాన్‌ ప్రణాళిక రూపొందిస్తున్నది. ఇప్పటికే అమెరికా ఆంక్షలతో ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది. అయితే, అమెరికా ఆంక్షలకు భయపడి ఇతర దేశాలు ఇరాన్‌తో అణ్వస్త్ర ఒప్పందం చేసుకోవడానికి వెనుకంజ వేస్తున్నాయి. ఇంతకుముందు ఇరాన్‌తో కుదుర్చుకున్న అణ్వస్త్ర ఒప్పందం నుంచి 2018లో వైదొలిగిన అమెరికా.. ఆ ఒప్పందంలోని అన్ని ఆంక్షలను అమలు చేయాలని ఒత్తిడి తెస్తున్నది. ముగిసిపోనున్న ఆంక్షలపై ఇరాన్‌ స్పందిస్తూ.. ఖఅమెరికా పెత్తనాన్ని ధిక్కరించేందుకు అంతర్జాతీయ సమాజానికి ప్రాముఖ్యం ఉన్న రోజు ఇదిగ అని వ్యాఖ్యానించింది.


తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/