ఇరాక్‌లో కదం తొక్కిన మహిళలు

Iraq- Women
Iraq- Women

బాగ్దాద్‌ : హక్కుల సాధన కోసం ఇరాక్‌లో మహిళలు, యువతులు కదం తొక్కారు. దీంతో, బాగ్దాద్‌ నగరంలోని తహ్రీర్‌ స్క్వేర్‌ ప్రాంతం జనసంద్రమైంది. నిరసనకారులు ప్లకార్డులు, బ్యానర్లు చేబూని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు నిరసనకారులు గళమెత్తారు. ఇరాక్‌లో నిరుద్యోగ సమస్య పెరిగిపోయిందన్నారు. ఇరాక్‌ అంత్గత వ్యవహారాల్లో విదేశీయుల జోక్యం పెరిగిపోయిందని, తద్వారా తమ సార్వభౌమత్వం దెబ్బతింటున్నదని అన్నారు. దేశంలో పాలన గాడి తప్పిందని విమర్శించారు. ప్రభుత్వం ఇకనైనా ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని నినదించారు. కాగా, గతంలో ఇరాక్‌ సర్కారు తీరును నిరసిస్తూ పలు కార్మిక, వాణిజ్య సంస్థలు తీసిన ర్యాలీలకు షియా నేత ముఖ్తదా అల్‌సద్ర్‌ నేతృత్వం వహించారు. ఆయన పిలుపు మేరకు అనేక సంఘాలు ఇరాక్‌లో జరిగిన నిరసన కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాల్గొన్నాయి. ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను ఆయన ముందుండి నడిపిస్తున్నారు. గతకొద్ది రోజుల నుంచి ఆయనే ప్రభుత్వ వ్యతిరేక నిరసనలను అణిచివేసేందుకు ప్రయత్నిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

తాజా ఎడిటోరియల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/editorial/