అనుకున్న పనులు జరిగితే ఏడాదిలోపే వ్యాక్సిన్
కరోనా వ్యాక్సిన్ తయారీ ప్రక్రియను ముమ్మరం చేశాం ..బిల్ గేట్స్

వాషింగ్టన్: మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ కరోనా వ్యాక్సిన్‌పై కీలక ప్రకటన చేశారు. కరోనాను అంతమొందించేందుకు వ్యాక్సిన్ రూపకల్పనలో ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు ఆయన వెల్లడించారు. అనుకున్న విధంగా అన్ని పనులు జరిగితే ఏడాది లోపే వ్యాక్సిన్ తయారీని మొదలు పెట్టనున్నామని చెప్పారు. ఒకవేళ ఇది కుదరకపోతే రెండేళ్ల లోపు కరోనాకు మందు కనుక్కోవడానికి సమయం పట్టవచ్చని చెప్పారు. వ్యాక్సిన్ ఉత్పత్తి సెప్టెంబరులో ప్రారంభం కాదని ఆయన అన్నారు. వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసేందుకు ఎన్నో ప్రయత్నాలతో శర వేగంగా పనులు జరుగుతున్నాయని చెప్పారు.
తాజా వీడియోస్ కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/videos/