రాహుల్ రామకృష్ణ ఇంటింటి రామాయణం టీజర్‌…

కమెడియన్ గా పరిచమైన రాహుల్ రామకృష్ణ..ఇప్పుడు హీరోగా కూడా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. తాజాగా ఈయన ఇంటింటి రామాయణం మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సురేష్ నరెడ్ల దర్శకుడిగా ఈ మూవీ తో ఎంట్రీ ఇస్తున్నాడు. విలేజ్‌లో వివిధ పాత్రల మధ్య నడిచే ఫన్‌ అండ్ కూల్‌ ఎలిమెంట్స్ తో ఇంటింటి రామాయణం సినిమా తెరకెక్కింది.

ప్రముఖ ఓటిటి ఫ్లాట్ ఫామ్ ఆహా లో ఇది స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ క్రమంలో మూవీ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేసి ఆసక్తి నింపారు. ఈ చిత్రంలో నరేష్, నవ్య స్వామి, గంగవ్వ, బిత్తిరి సత్తి కీలక పాత్రలు పోషిస్తున్నారు. విలేజ్‌ డ్రామానేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మారుతి – IVY ప్రొడక్షన్స్ నిర్మిస్తుండగా.. నిర్మాత నాగ వంశీ, ఆహా సంయుక్తంగా సమర్పిస్తున్నాయి. ఈ వెబ్ ప్రాజెక్ట్‌కు కళ్యాణ్ మాలిక్ సంగీతం అందిస్తున్నారు.

YouTube video