అంతర్జాతీయ విమాన సర్వీసులు పునఃప్రారంభం

నేటి నుంచి అమెరికా, ఫ్రాన్స్‌, జర్మనీల నుంచి విమానాలు

Air India
Air India

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ కారణంగా నాలుగు నెలల నుండి అంతర్జాతీయ విమాన సర్వీసులు నిలిచిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈరోజు నుండి అంతర్జాతీయ విమాన సర్వీసులు పునఃప్రారంభం కానున్నాయి. అమెరికా, ఫ్రాన్స్ దేశాల నుంచి మన దేశానికి పాక్షికంగా విమానాలు నడవనున్నాయి. అమెరికాకు చెందిన యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ ఈ నెల 1731 మధ్య 18 విమానాలను నడపనుంది. ఢిల్లీన్యూయార్క్‌ మధ్య ప్రతి రోజూ, ఢిల్లీశాన్‌ఫ్రాన్సిస్కో మధ్య వారానికి మూడు రోజులు విమానాలు నడపనున్నట్టు పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. ఈ నెల 18 నుంచి ఆగస్టు 1 మధ్య ఎయిర్ ఫ్రాన్స్ కు చెందిన 28 విమానాలు నడవనున్నాయి. అలాగే, ఈ రెండు దేశాలకు ఎయిర్ ఇండియా విమాన సర్వీసులు అందుబాటులో ఉంటాయి. మరోపక్క, ఢిల్లీ, లండన్ మధ్య రోజుకు రెండు విమానాలు నడిపేందుకు బ్రిటన్‌తో ఒప్పందం చేసుకోనున్నట్టు మంత్రి తెలిపారు. జర్మనీకి చెందిన ఎయిర్ లుఫ్తాన్సాతో దాదాపు ఒప్పందం పూర్తయిందని మంత్రి పూరి వివరించారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/