సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో భారీ అగ్ని ప్రమాదం

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున బాబీ లాడ్జి వద్ద భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పాలికా బజార్‌లో ధమాకా సేల్ రెడీమేడ్ బట్టల షాప్‌లో ఈ అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు, దట్టమైన పొగలు రావడంతో చుట్టుప్రక్కల నివసించే వారు ప్రాణ భయంతో రోడ్డుపైకి పరుగులు తీశారు. దాని చుట్టుపక్కల మరిన్ని దుకాణాలతో పాటు లాడ్జీలు కూడా ఉన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన ప్రదేశానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

షాట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక భారీ అగ్ని ప్రమాదం లో లక్షల్లో ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం అందుతోంది. సికింద్రాబాద్ పరిధిలో గత కొద్దీ నెలలుగా రెండు షాపింగ్ కాంప్లెక్స్ లు, ఓ లాడ్జిలో అగ్ని ప్రమాదాలు జరిగిన సంగతి తెలిసిందే.