ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేష్ ను విచారిస్తున్న సీఐడీ

ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో భాగంగా సిట్ అధికారులు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను విచారిస్తున్నారు. తాడేపల్లిలోని SIT కార్యాలయంలో విచారణ మొదలైంది. IRR allignment మార్పు కేసులో లోకేష్‌ను A-14గా పేర్కొంటూ ఏసీబీ కోర్టులో సీఐడీ మెమో ఫైల్ చేసిన సంగతి తెలిసిందే. లోకేష్‌ను CRPCలోని సెక్షన్ 41A క్రింద నోటీసులు ఇచ్చి విచారిస్తామని ఏపీ హైకోర్ట్‌కు సీఐడీ చెప్పింది.

కోర్టు ఆదేశాల మేరకు ఈరోజు 10 గంటలకు లోకేష్ ను విచారించడం మొదలుపెట్టారు. నిన్న ఢిల్లీ నుంచి విజయవాడకి లోకేష్ చేరుకున్నారు. లోకేష్ విచారణ నేపథ్యంలో తాడేపల్లిలోని SIT కార్యాలయం వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. లోకేశ్ విచారణ నేపథ్యంలో టీడీపీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది.