బాలా త్రిపుర సుందరీ దేవిగా బెజవాడ దుర్గమ్మ

ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు

Sri Bala Tripura Sundari devi Alamkaram
Sri Bala Tripura Sundari devi Alamkaram

Vijayawada: ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నవరాత్రి మహోత్సవాల్లో రెండవ రోజున కనకదుర్గమ్మ బాలా త్రిపుర సుందరీ దేవిగా దర్శనమిచ్చారు.

ఆలయ అధికారులు నేటి ఉదమయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అమ్మవారి దర్శనానికి భక్తులకు అనుమతి ఇచ్చారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా ఆన్‌లైన్‌లోనే టికెట్ బుక్ చేసుకోవాలని స్పష్టం చేశారు.

గంటకి 1000 మంది చొప్పున రోజుకు 10వేల మందికి భక్తులకు మాత్రమే అమ్మవారి దర్శనానికి అనుమతి ఇస్తున్నారు .

ఇదిలాఉండగా, మనస్సు, బుద్ధి, చిత్తం బాల త్రిపురసుందరీ దేవి ఆధీనంలో ఉంటాయని అర్చకులు చెబుతున్నారు. వేద పండితులు తెలిపిన వివరాల ప్రకారం..

అభయహస్త ముద్రతో ఉండే ఈ తల్లి అనుగ్రహం కోసం ఉపాసకులు బాలార్చన చేస్తారు.

ఈ రోజున రెండు నుంచి పదేళ్ల లోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి.. పూజించి కొత్త బట్టలు పెడతారు. అమ్మవారికి ఆకుపచ్చ, ఎరుపు, పసుపు రంగు చీరలు కట్టి పాయసం, గారెలను నైవేద్యంగా నివేదిస్తారు.

బాలా త్రిపుర సుందరీదేవిని దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుందని ఆలయ అర్చకులు చెబుతున్నారు

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/