మసీదులో దాక్కున్న ఇండోనేషియా వాసులు

క్వారంటైన్‌కు తరలించిన పోలీసులు

indoneshiya tabligi members
indoneshya tabligi members

ధన్‌బాద్‌: దేశంలో జరిగిన ఢిల్లీ మత ప్రార్దనలు హజరయ్యేందుకు వచ్చిన ఇండోనేషియా వాసులను పోలీసులు అదుపులోకి తీసుకుని వారిని క్వారంటైన్‌కు తరలించారు. వీరంతా తబ్లీగీ జమాత్‌ జరిగిన అనంతరం వీరు జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌ చేరుకున్నారు. ఆ తరువాత దేశంలో లాక్‌డౌన్‌ విధించడంతో వారంతా అక్కడే ఉన్న మసీదులో రహస్యంగా దాక్కున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వారిని అధీనంలోకి తీసుకుని 14 రోజులు క్వారంటైన్‌కు తరలించారు. ఆ తరువాత స్థానిక కోర్టు ఆదేశాల మేరకు వారిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వీసా నిబంధనల ఉల్లంఘనలతో పాటు, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ 2005 చట్టం కింద ఇండోనేషియా వాసులను అరెస్టు చేసినట్లు ధన్‌బాద్‌ పోలీసు అధికారి సురేంద్రసింగ్‌ తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/