కెనడాలో కల్పుల కలకలం..16 మంది మృతి

పోలీసు దుస్తుల్లో వచ్చి…ఇళ్లలోని వారిపై కాల్పులు జరిపి ..ఇళ్లకు నిప్పు పెట్టిన దుండగుడు

Gunman kills 16 in Nova Scotia
Gunman kills 16 in Nova Scotia

ఒట్టావా(కెనడా) :లాక్‌డౌన్‌ అమల్లో ఉన్న కెనడాలోని . నోవా స్కోటియా రాష్ట్రంలోని పోర్టాపిక్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. పోలీసు దుస్తుల్లో వచ్చిన ఓ దుండగుడు విచక్షణ రహితంగా జరిపిన కాల్పుల్లో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో ఓ మహిళా పోలీసు కూడా మృతి చెందింది. దుండగుడు ఇళ్లలో ఉన్నవారిపై కాల్పులు జరిపిన అనంతరం ఇళ్లకు నిప్పు పెట్టినట్టు పోలీసులు తెలిపారు. ఇంటి లోపల, బయట చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలను పోలీసులు గుర్తించారు. తన కారును పోలీసు వాహనంలా తీర్చిదిద్దిన ఆగంతకుడు పోలీసు దుస్తులు ధరించి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. కాగా నిందితుడిని 51 ఏళ్ల గాబ్రియెల్ వోర్ట్‌మన్‌గా గుర్తించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/