కుప్పకూలిన ఇండియన్‌ నేవీ హెలికాప్టర్‌..అధికారి మృతి

Indian Navy helicopter crashes in Kochi; one killed

కొచ్చి: భారత నావికాదళానికి చెందిన చేతక్‌ హెలికాప్టర్‌ కుప్పకూలింది. ఈ ఘటనలో ఓ అధికారి ప్రాణాలు కోల్పోయారు. నేవీకి చెందిన హెలీకాప్టర్‌ శనివారం మధ్యాహ్నం నేవీ హెడ్ క్వార్టర్స్‌లోని ఐఎన్‌ఎస్ గరుడ రన్‌వేపై ఈ ప్రమాదం జరిగింది. పైలట్‌తో సహా ఇద్దరికి గాయపడ్డట్లు తెలుస్తున్నది. అలాగే, చాపర్ రోటర్ బ్లేడ్లు తగలడంతో రన్‌వేపై ఉన్న నౌకాదళ అధికారి మృతి చెందినట్లు సమాచారం. ఇద్దరు పైలట్లకు గాయాలైనట్లు ప్రాథమికంగా తెలుస్తున్నది. ఇద్దరిని నావికాదళ ప్రధాన కార్యాలయంలోని సంజీవని ఆసుప్రతికి తరలించగా చికిత్స పొందుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే కొచ్చి హార్బర్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.