థాయ్‌లాండ్‌తో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం

తెలంగాణ రాష్ట్రం దేశ వృద్ధి రేటును మించి అభివృద్ది చెందుతుంది

thailand and telangana mou
thailand and telangana mou

హైదరాబాద్‌: మదాపూర్‌లో శనివారం ఇండియా-థాయ్‌లాండ్‌ మ్యాచింగ్‌ అండ్‌ నెట్‌వర్కింగ్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి థాయ్‌లాండ్‌ ఉప ప్రధాని జరీన్‌ లక్సనావిసిత్‌, తెలంగాణ మంత్రి కెటిఆర్‌ హాజరయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ మంత్రి కెటిఆర్‌ మాట్లాడుతూ.. థాయ్‌లాండ్‌కు భారత్‌కు చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయన్నారు. రబ్బర్‌ వుడ్‌ పరిశ్రమలో థాయ్‌లాండ్‌ ప్రభుత్వం భారీగా పెట్టుబడులు పెట్టనుందని మంత్రి తెలిపారు. తెలంగాణతో థాయలాండ్‌ ప్రభుత్వం పరస్పర అవగాహన ఒప్పందం (ఎంఓయూ) చేసుకొని, పెట్టుబడులకు ముందుకు రావడం సంతోషంగా ఉందని కెటిఆర్‌ అన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశ వృద్ది రేటును మించి అభివృద్ధి చెందుతోందని ఆయన పేర్కొన్నారు. థాయ్‌లాండ్‌ నుంచి భారత్‌కు గేట్‌వేగా తెలంగాణతో అనుసంధానం చేయాలని తెలిపారు. తెలంగాణలో వాణిజ్య రంగంలో చాలా మంచి అవకాశాలు ఉన్నాయని, థాయ్‌లాండ్‌ ప్రభుత్వాన్ని తెలంగాణలో ఫర్నిచర్‌ పర్క్‌ ఏర్పాటు చేయాలని కెటిఆర్‌ థాయ్‌లాండ్‌ ఉప ప్రధానిని కోరారు. థాయ్‌లాండ్‌ ఉప ప్రధాని భారత్‌ పర్యటన పెట్టుబడులకు ఊతం ఇచ్చేలా ఉందని కెటిఆర్‌ పేర్కొన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/