దుబాయ్ లో కరోనా సోకిన భారతీయుడు

అధికారికంగా ప్రకటించిన యూఏఈ మంత్రిత్వ శాఖ

indian infected with coronavirus in dubai
indian infected with coronavirus in dubai

దుబాయ్: ఉద్యోగరీత్యా దుబాయ్ కు వెళ్లిన ఒక భారతీయుడికి కరోనా వైరస్‌ సోకినట్లుగా నిర్ధారణ అయ్యింది. వైరస్‌ సోకిన వ్యక్తితో కలిసి ఉన్నందున అతడికి కూడా ఈ వైరస్‌ సోకిందని అక్కడి డాక్టర్లు తెలిపారు. అయితే ఆ ఇండియన్ పేరు, ఇతర వివరాలను వెల్లడించలేదు. తమ దేశంలో కరోనా వైరస్ ఎఫెక్ట్ పై యూఏఈ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం ట్వీట్ చేసింది. ఖఖవైరస్ సోకిన వ్యక్తితో కలిసి ఉన్న ఒక ఇండియన్ కు కరోనా సోకినట్టు వైద్య పరీక్షల్లో వెల్లడైంది. దీనితో యూఏఈలో కరోనా వైరస్ సోకినవారి సంఖ్య ఎనిమిదికి చేరింది. వైరస్ సోకినట్టుగా అనుమానమున్న మరికొందరిని హాస్పిటల్స్ లో చేర్చి పరీక్షలు చేస్తున్నాంగగ అని ప్రకటించింది. దుబాయ్ లో కరోనా వైరస్ సోకిన ఎనిమిది మందిలో ఆరుగురు చైనా వాళ్లు, ఒకరు ఫిలిపినో, ఒకరు ఇండియన్ అని అధికారులు తెలిపారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/