నేపాల్‌లో అమృత్‌పాల్‌?..పారిపోకుండా అడ్డుకోవాలని ఇండియా విజ్ఞప్తి

Indian Embassy urges Nepal to not let ‘hidden’ Khalistani

కాఠ్మాండు: ఖలిస్తానీ వేర్పాటువాది, ‘వారిస్‌ పంజాబ్‌ దే’ చీఫ్‌ అమృత్‌పాల్‌సింగ్‌ నేపాల్‌లో దాక్కున్నట్టు సమాచారం. అతడు భారత లేదా ఇతర నకిలీ పాస్‌పోర్టు ఉపయోగించి వేరే దేశాలకు పారిపోవాలని చూస్తే అరెస్ట్‌ చేయాలని నేపాల్‌కు ఇండియా విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కాఠ్మాండులోని భారత రాయబార కార్యాలయం.. కాన్సులర్‌ సర్వీసెస్‌ విభాగానికి లేఖ రాసింది. అలాగే, అమృత్‌పాల్‌సింగ్‌ వ్యక్తిగత వివరాలను అన్ని హోటళ్ల నుంచి ఎయిర్‌లైన్స్‌ వరకు సర్క్యులేట్‌ చేసింది. 18 పేర్లతో నకిలీ పాస్‌పోర్టులు కలిగిన అమృత్‌పాల్‌సింగ్‌ మార్చి 18 నుంచి పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు.