రాహుల్ గాంధీపై అనర్హత వేటు ఫై స్పందించిన అమెరికా

ప్రధాని మోడీ ఇంటి పేరు కలవారందరూ దొంగలే అంటూ వ్యాఖ్యానించి రెండేళ్ల జైలుశిక్ష పొందిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పై అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే. రాహుల్ గాంధీ పై అనర్హత వేటు వేయడాన్ని ప్రతిపక్ష పార్టీ లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే ఎంతోమంది దీనిపై స్పందించగా..తాజాగా అమెరికా స్పందించింది.

‘‘ఏ దేశ ప్రజాస్వామ్యానికైనా.. చట్ట నిబంధనలను గౌరవించడం, న్యాయ స్వతంత్రత మూల స్తంభాలు. భారత కోర్టుల్లో రాహుల్‌ గాంధీ కేసును మేం గమనిస్తున్నాం. అయితే భావ ప్రకటనా స్వేచ్ఛతో పాటు ప్రజాస్వామ్య విలువలపై భారత ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు నిబద్ధతతో ఉన్నాం. మా రెండు దేశాలకు కీలక అంశాలైన ప్రజాస్వామ్య సూత్రాలు, మానవ హక్కుల పరిరక్షణ, భావ ప్రకటనా స్వేచ్ఛ ప్రాముఖ్యతను నిత్యం హైలైట్‌ చేస్తూనే ఉంటాం’’ అని అమెరికా విదేశాంగ శాఖ డిప్యూటీ అధికార ప్రతినిధి వేదాంత్‌ పటేల్‌ తెలిపారు.