ఇండియన్‌ ఆర్మీ హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య..

indian-army-chetak-helicopter-makes-dramatic-touch-down-after-engine-chip-warning-indian-air-force

జైపూర్‌: సాంకేతిక సమస్య తలెత్తడంతో ఇండియన్‌ ఆర్మీకి చెందిన చేతక్ హెలికాప్టర్‌ లో దీంతో ముందు జాగ్రత్త కోసం పొలాల్లో దానిని ల్యాండ్‌ చేశారు. అనంతరం అక్కడి నుంచి అది ఎగిరి వెళ్లింది. అయితే ఆర్మీ హెలికాప్టర్‌ను చూసేందుకు స్థానికులు ఎగబడ్డారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. రాజస్థాన్‌లో ఈ సంఘటన జరిగింది. శుక్రవారం జైపూర్‌కు వెళ్తున్న ఆర్మీకి చెందిన చేతక్ హెలికాప్టర్‌లో ఇంజిన్ చిప్ వార్నింగ్ లైట్ ఆన్ అయ్యింది. దీంతో పైలట్లు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్త కోసం సమీపంలోని పొలాల్లో అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు. కొంత సేపటి తర్వాత ఆ హెలికాప్టర్‌ అక్కడి నుంచి ఎగిరి వెళ్లింది. అయితే ఆర్మీ హెలికాప్టర్‌ను చూసేందుకు స్థానికులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు.

కాగా, ఇండియన్‌ ఆర్మీ ఈ విషయాన్ని ధృవీకరించింది. జైపూర్‌కు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న దిద్వానాలో శుక్రవారం ఉదయం 10:35 గంటల సమయంలో సైనిక హెలికాప్టర్ పొలాల్లో దిగినట్లు తెలిపింది. ఆ సమయంలో అందులో వీఐపీలు ఎవరూ లేరని పేర్కొంది. సాంకేతిక సమస్యను సరిదిద్దిన తర్వాత హెలికాప్టర్ నిర్ణీత గమ్యస్థానానికి చేరుకున్నట్లు వెల్లడించింది. మరోవైపు ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.